హైదరాబాద్, జూలై 29:తెలంగాణలోని భారీ వర్షాలు, వరదలు పలుచోట్ల తీవ్ర విషాదాన్ని నింపాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 మందికిపైగా మృతి చెందారు. గల్లంతు అయిన వారిలో కొందరి ఆచూకీ లభ్యం కాకపోవటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది రాష్ట్రంలో భారీగా కురుసిన వర్షాల దాటికి జనజీవనం అస్తవ్యవస్తమైపోయింది. మరోవైపు వరదల దాటికి పలు జిల్లాల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. గత మూడు రోజుల్లో వాగులు, వరద నీటిలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇప్పుడిప్పుడే చాలా మంది మృతదేహాలు లభ్యమవుతున్నాయి. వారిలో కొందరి మృతదేహాలు గురు, శుక్రవారాల్లో బయటపడ్డాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 మందికిపైగా మృతి చెందారు. గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉందని తెలుస్తోంది. ప్రధానంగా… ములుగు జిల్లా జంపన్నవాగు వరదలో గల్లంతైన 15మందిలో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది.
దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ప్రకటన చేశారు.ములుగు జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్త్ను భారీ వర్షాలకు జనజీవనం స్థంభిచిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గురువారం వరదలో గల్లంతైన 11 మంది మృతి చెందారు. శుక్రవారం వీరి మృతదేహాలు లభించాయి. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. తక్షణ సాయం కింద రూ. 25 వేల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.వరదల దాటికి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఇక ఖమ్మం జిల్లాలోనూ వరదల తీవ్రత అధికంగా ఉంది. జలగంనగర్ వద్ద మున్నేరు వరదలో గురువారం గల్లంతైన వ్యక్తి మృతదేహాం కూడా లభ్యమైంది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పరిధిలో కూడా ఒక మృతదేహాం చిక్కింది. ఆసిఫిబాద్, కొత్తగూడెం జిల్లాలో కూడా గల్లంతైన పలువురు చనిపోయారు. ఇక 12 మందికిపైగా గల్లంతైన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది మరోవైపు గోదావరికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఫలితంగా భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 53 అడుగులు దాటిపోయింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే 430 గ్రామాలకు చెందిన ప్రజలను 40 పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. వరదల పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.