ఆత్మీయ ఆలింగనం చేసుకొని.. తమ్మి అంటూ గుండెకు హత్తుకున్న మంత్రి కేటీఆర్..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారం గ్రామానికి చెందిన కవి, గాయకుడు మానుకోట ప్రసాద్ కు ప్రగతిభవన్ నుంచి పిలుపువచ్చింది..మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ లతో కలిసి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు ని మానుకోటప్రసాద్ కలిసారు.రచయితగా మానుకోట ప్రసాద్ ఎన్నో అద్బుతమైన పాటలు రాయడం జరిగింది..అదే క్రమంలో కేటీఆర్ మీద రాసిన రెండు పాటలు.”పేదల గడపల్లో పచ్చని తోరణమై ఆకలి తీర్చే అండవు నువ్వే కేటీఆర్ అన్న”పేదల పాలిట పెద్దవు నువ్వే పేరైన అయ్యకు బిడ్డవు నువ్వే”
అనే రెండు పాటలు*
మంత్రి కేటీఆర్ కి నచ్చి ప్రసాద్ ను ప్రత్యేకంగా ప్రగతిభవన్ కు ఆహ్వానించారు. వెల్లగానే.. ఆత్మీయంగా హత్తుకొని, సోదర ప్రేమ చూపించారు.ప్రసాద్ అని పేరు పెట్టి సంభోదించి బాగరాసావు తమ్మి పాటలు..!! ఇలాగే ముందుకు వెల్లు, మంచి భవిషత్తు, గౌరవం ఉంటుంది మన పార్టీ లో.. అంటూ కేటీఆర్ ప్రశంసించారు.సాయిచంద్ మరణం తర్వాత బిఆర్ఎస్ పార్టీ, కేసిఆర్ సభలు, కేటీఆర్ సభల్లో , మద్దెల సందీప్, మానుకోట ప్రసాద్, మధుప్రియ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారని, నేను చూస్తున్నానని బాగుంటున్నాయని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వేదికలన్నీ మీ పాటలతో ఉర్రూతలూగించాలి సభల్లో పాల్గొనేలా చూసుకోండి అని కేటీఆర్ భుజంతట్టి ప్రసాద్ కు చెప్పారు.
ఈ కార్యక్రమంలో…
మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి,తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్,నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,కరీంనగర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, తుంగ బాలు,సాగర్ డప్పు బాబు, పాలకుర్తి శ్రీకాంత్ తదితరులు ప్రసాద్ వెంట ఉన్నారు.