హైదరాబాద్:సీఎం కేసీఆర్ నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించడానికి బయలుదేరారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ బయల్దేరారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు భారీ కాన్వాయ్ తరలి వెల్లారు.
భారత్ రాష్ట్ర సమితి మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ను ఎప్పుడైతే స్థాపించారో ఆరోజు నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల జూన్ 15న మహారాష్ట్రలోని నాగపూర్లో పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్లోని సావ్ఖేడా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిందిగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.