A place where you need to follow for what happening in world cup

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ

  • మెదక్, నర్సపూర్ లో 579 పిఎస్ లు, 4.34,900 ఓటర్లు
  • జిల్లాలో 5 చెక్ పోస్టులు
  • జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి షా

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్ లతో కలిసి కలెక్టరేట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ… మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో 4,34,900 మంది ఓటర్లున్నారు. మెదక్ లో 2,14,118 మంది ఓటర్లు, నర్సాపూర్ లో 2,20,782 మంది ఓటర్లున్నారు. ఈసారి 18-19 ఏళ్ల వయసుగల కొత్త ఓటర్లు 15, 715 మంది ఉన్నారని వారు మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటారన్నారు. పిడబ్ల్యూడి ఓటర్లు 8882 మంది, 80 ఏళ్లకు పైబడినవారు 4165 మంది ఉన్నట్లు వివరించారు. ఫాం 7 మినహా 6, 8 నిరంతరంగా స్వీకరిస్తామన్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు జిల్లాలో మొత్తం 764 పోలింగ్ కేంద్రాలున్నాయాన్నారు.

అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం ఉంటుందన్నారు. పిడబ్ల్యూడి పోలింగ్ కేంద్రంలో సిబ్బంది కూడా వారే ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు మహిళా పోలింగ్ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 50 అనగా 319 పోలింగ్ కేంద్రాల్లో
వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. పార్టీలు, పార్టీల అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. నిబంధనలు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో పథకాలు, ఫోటోల కటౌట్లు వెంటనే తొలగిస్తామన్నారు.

పాత ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయన్నారు. నిరంతర పార్యవేక్షణకు ప్రతి నియోజకవర్గంలో 4 బృందాకు తగ్గకుండా స్క్వాడ్, రెండు వీడియో, 2 సహాయ ఖర్చుల అబ్సర్వర్స్ ఉంటారన్నారు. జిల్లాలో 1950 కంట్రోల్ రూం ఉంటుందన్నారు. ఎలాంటి ఫిర్యాదులైనా చేయవచ్చన్నారు. సి విజిల్ కంట్రోల్ రూంతో పాటు రిటర్నింగ్ అధికారి టీం కూడా ఉంటుందన్నారు. తప్పుడు వర్తలపై చర్యలుంటాయన్నారు. మొదటిసారిగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది శిక్షణ రోజు తమ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్దులు, సదరం సర్టిఫికెట్స్ ఉన్న వికలాంగులు బిఎల్ఓల ద్వారా హోమ్ ఓటు వినియోగించుకోవచ్చన్నారు. సువిధ యాప్ గురించి మార్గదర్శకాలు రాలేదన్నారు.

ఎస్పీ రోహిణి ప్రయదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలో 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు
నిరంతరం సీసీ కెమెరాలుంటాయాన్నారు. 50 వెలకు మించి నగదు రవాణా చేస్తే సీజ్ చేస్తారని, అందుకు తగిన ఆధారాలు చూపితే కమిటీ పరిశీలన అనంతరం తిరిగి ఇస్తారాన్నారు. 20 లక్షల పైన ఉంటే ఐటీ శాఖ పరిశీలిస్తుందన్నారు. 2014 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో గొడవలు పడిన, ఇబ్బంది పెట్టిన వారిని బైండొవర్ చేస్తున్నామన్నారు. జిల్లాలో 38 లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఉన్నాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.