ఎన్నికలకు ముందు దళితులను ,గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దేశం లో 40 కోట్ల మందికి పైగా దళిత ,గిరిజనులు ఉన్నారు. .50 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళిత ,గిరిజనులను మోసం చేసింది ,వంచించి ఓట్లు వేసుకుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులు కారు. మల్లికార్జున్ ఖర్గే ఈ ఎస్యసీ, ఎస్టీ డిక్లరేషన్ ను తెలంగాణ లో కాదు విడుదల చేయాల్సింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ..దేశ వ్యాప్తంగా ఈ డిక్లరేషన్ విడుదల చేయాలి. .కాంగ్రెస్ డిక్లరేషన్ ఎవ్వరూ నమ్మేలా లేదు.
.ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ కు ఆలోచన ఎందుకు రాలేదు. .కాంగ్రెస్ హాయం లో దళిత గిరిజన విద్యార్థుల కోసం ఇన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజీలు పెట్టారా. మొత్తం 1006 రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టాం. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో దళిత గిరిజనులకు అడ్మిషన్లు దొరుకుతున్నాయంటే అది రెసిడెన్షియల్ విద్య ఫలితమే. .కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం ఎందుకు లేదు. కేసీఆర్ తరహా లో దళిత బంధు పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆలోచించలే. దళితులకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ కు వచ్చి కాంగ్రెస్ నేతలు దళిత గిరిజనులకు డిక్లరేషన్ విడుదల చేస్తారు.
దళిత బంధు కోసం 12 లక్షల రూపాయలు కాదు కాంగ్రెస్ కు దమ్ముంటే తమ పాలిత రాష్ట్రాల్లో ఐదు లక్షలు ఇస్తే చాలు. .కేవలం ఎన్నికలు ఉన్నాయనే తెలంగాణ లో డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది. కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదు. .దళిత గిరిజనులకు దేశం లో ఎక్కడా లేని సంక్షేమం అమలవుతోంది. కాంగ్రెస్ నేతల ఆపద మొక్కులను ఎవ్వరూ నమ్మరని అన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ బూటకం. .దళిత బంధు లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అనేది దుష్ప్రచారం మాత్రమే. .ఎన్నికలు ఎలా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.