- మంత్రి ఈశ్వర్ ను ప్రశ్నించిన మహంకాళి రాజన్న
జగిత్యాల: రోల్లవాగు ప్రాజెక్టు విస్తరణను పెంచడము మంచిదేనని నీరు వచ్చే కాలువలను విస్తరించకుండా ప్రాజెక్టు ను ఎలా నింపుతారో చెప్పాలని టిడిపి జగిత్యాల ఇంచార్జ్ మహంకాళి రాజన్న మంత్రి ఈశ్వరను ప్రశ్నించారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో మహంకాళి రాజన్న ప్రకటన విడుదల చేశారు. రోల్లవాగు ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం ఒక్కసారిగా పెరిగిందని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. రోల్లవాగు స్టోరేజ్ కెపాసిటీని ఒక టీఎంసీకి పెంచడం మంచిదే అన్నారు. కానీ ఈ ప్రాజెక్టు పావు టీఎంసీ నీటి నిల్వ ఉన్న సమయంలో నీరు నిండేందుకు తవ్విన కాలువల కెపాసిటీ 150 క్యూసెక్కుల సామర్థ్యం అని చెప్పారు అలాగే నీరు బయటకు పోయేందుకు ఉన్న కాలువ కెపాసిటీ కూడా 150 క్యూసెక్కులని చెప్పారు.
ఇంత చిన్నటి కాలువలతో ఒక టీఎంసీ నీటిని ఎంత కాలానికి నింపుతారో చెప్పాలని రాజన్న ప్రశ్నించారు. అలాగే మీరు పేర్కొన్నట్లు 20 వేల ఎకరాలకు నిరందించడం సాధ్యమా అని రాజన్న ప్రశ్నించారు. వీటికితోడు కాంట్రాక్టర్ కు బిల్లుల బకాయీతో పనులు పురోగతిలో ఉంటాయో చెప్పాలన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలను ప్రభుత్వ తప్పులను సరిద్దిద్దుకోవడానికే తీసుకోవాలే తప్ప ఎదురుదాడి సరికాదని మహంకాళి రాజన్న మంత్రి ఈశ్వర్ కు సూచించారు. ఆయన వెంట రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షులు ఓరుగంటి భార్గవ్ రాం, న్యాయవాది విజయ్ కుమార్ నాయకులు బత్తుల కొండయ్య, నక్క లక్ష్మణ్, సాన రాములు లు ఉన్నారు.