జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.38.4 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లతో కలిసి మంత్రి కే.టి.ఆర్. ప్రారభించారు. అనంతరం మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామంలో రూ. 280 కోట్లతో నిర్మించిన జగిత్యాల పట్టాణ డబుల్ బెడ్ రూం ఇండ్లలో మొదటి దశలో పట్టణంలోని 3722 మంది నిరుపేద లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణి చేసి, గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో రూ. 4.50 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్ – నాన్ వేజ్ మార్కెట్ లను మంత్రులు ప్రారంబించారు.
ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకే రవి శంకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, రమణ, కరీంనగర్ ఐజి చంద్రశేకర్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ఎస్పి ఎగ్గడి భాస్కర్, జెడ్పి చైర్పర్సన్ దావా వసంత, ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ రాజేశం గౌడ్, అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, దివారక, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా వివిధ శాఖల అధికారి, తదితరులు పాల్గొన్నారు.