A place where you need to follow for what happening in world cup

ట్రైనీ వైద్యురాలి హత్యాచారం, హత్య కేసు…. వెలుగులోకి షాకింగ్‌ ‌విషయాలు

  • ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రికి ఫోన్‌
  • ‌పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కోల్‌కతా,ఆగస్ట్13: ‌దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ‌మెడికల్‌ ‌కాలేజీ -హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో తాజాగా మరికొన్ని షాకింగ్‌ ‌విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం రాత్రి హత్య జరగగా.. శుక్రవారం ఉదయం  వైద్యురాలి తండ్రికి కాల్‌ ‌చేసి సమాచారం అందించారు. అయితే కాల్‌ ‌చేసిన వ్యక్తి ’ కూతురు ఆత్మహత్య చేసుకుంది’ అని చెప్పాడంటూ వైద్యురాలి తండ్రి చెప్పారు.

వెంటనే ఆసుపత్రికి వెళ్లి చూడగా సెమినార్‌ ‌హాల్‌లో సగం బట్టలు, గాయాలతో తన కూతురు నిర్జీవంగా ఉందని ఆయన వివరించారు. ఈ మేరకు పోలీసుల విచారణలో ఆయన వెల్లడించారు.‘మెడిసిన్‌ ‌డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ ‌సూపరింటెండెంట్‌ అం‌టూ ఫోన్‌ ‌చేశారు.  కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ తర్వాత మేము ఆసుపత్రికి చేరుకున్నప్పుడు వాస్తవం ఏంటో తెలుసుకున్నాం‘ అని డియాకు వెల్లడించారు. సదురు అధికారి తన పేరు చెప్పలేదని అని పేర్కొన్నారు. మెడికల్‌ ‌కాలేజీ యాజమాన్యం అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.

కాగా పోలీసు విచారణ ప్రకారం.. వైద్యురాలు గురువారం రాత్రి డ్యూటీలో ఉన్నారు. హత్యకు ముందు మరో నలుగురు తోటి వైద్యులతో కలిసి డిన్నర్‌ ‌చేశారు. దీంతో ఆమెతో డిన్నర్‌ ‌చేసిన వ్యక్తులతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదని వైద్యురాలి తల్లి డియాతో చెప్పారు. ‘ నా కూతుర్ని చూడనివ్వాలని వాళ్ల కాళ్ల ద పడ్డాను. అయినా చూడనివ్వలేదు. మధ్యాహ్నం 2 గంటలకు నా కూతురిని చూసేందుకు అనుమతి ఇచ్చారు‘ ఆమె వాపోయారు. కాగా హత్యకు ముందు గురువారం రాత్రి వైద్యురాలు తన తల్లికి ఫోన్‌ ‌చేసిందని, అన్నం తిని పడుకోమని చెప్పిందని కుటుంబ సభ్యులు చెప్పారు. అంతలోనే రాత్రి ఈ ఘోరం జరిగిపోయిందని వివరించారు. వచ్చే ఏడాది ఆమెకు పెళ్లి చేయాలనుకు న్నామని వివరించారు.

కాగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పారో తెలుసుకునేందుకు ఆసుపత్రిలోని ఛాతీ వైద్య విభాగం అసిస్టెంట్‌ ‌సూపరింటెండెంట్‌, ‌విభాగాధిపతిని పోలీసులు పిలిచి విచారించారు. ఆసుపత్రికి తరచూ వచ్చే సంజయ్‌ ‌రాయ్‌ అనే వలంటీర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఇతరులు ఎవరికైనా ప్రమేయం ఉంటే నాలుగైదు రోజుల్లో కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు. చెస్ట్ ‌మెడిసిన్‌ ‌విభాగానికి చెందిన ఇంకెవరికైనా నేరంలో ప్రమేయం ఉందా అనే కోణం మృతురాలి కుటుంబం అనుమానం వ్యక్తం చేశారు. చెస్ట్ ‌మెడిసిన్‌ ‌విభాగంలోని సిబ్బంది అందరినీ విచారించాలంటూ డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇంకెవరి హస్తమైనా ఉండొచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్‌లో ఎవరితోనైనా తమ బిడ్డకు శత్రుత్వం ఉందేమో తెలియదని, లేక ఎవరైనా అసూయపడ్డారా అనేది తెలియాల్సి ఉందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.